ఆరోగ్యానికి అండగా నిలిచే గుమ్మడిని రోజు మార్నింగ్ ఇలా తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి!

గుమ్మడి.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

గుమ్మడి లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అవి మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

కానీ కొందరికి గుమ్మడిని కూర రూపంలో తీసుకోవడం ఇష్టం ఉండదు.అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే విధంగా గుమ్మడి( pumpkin ) తో స్మూతీని తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యానికి అండగా నిలిచే గుమ్మడితో స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మరియు అది అందించే ఆరోగ్య లాభాలు ఏంటి అన్నది తెలుసుకుందాం ప‌దండి.ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పై తొక్క మరియు లోపల ఉండే గింజలను తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ ప్యూరీ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ ప్యూరీని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు గుమ్మడి ప్యూరీ వేసుకోవాలి.

అలాగే ఒక అరటి పండు( Banana ), వన్ టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్( Peanut butter ), పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు జాజికాయ పొడి( Nutmeg powder ), చిటికెడు అల్లం పొడి వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాసు బాదం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తే మన గుమ్మడి స్మూతీ సిద్ధం అయినట్టే.ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.

రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీ ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

కంటి చూపు రెట్టింపు అవుతుంది.ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి.

Advertisement

మోకాళ్ళ నొప్పులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకునే శక్తి కూడా ఈ స్మూతీకి ఉంది.

ఈ స్మూతీ చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

మరియు ఈ స్మూతీ వెయిట్ లాస్ కు సైతం సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

తాజా వార్తలు