మీ ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉందా... కారణాలు ఇవే. !!

సాధారణంగా మన ఇంట్లో అనుకున్న పనులు సక్రమంగా జరగకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తారు.

ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలని ఇల్లు కట్టేటప్పుడు, లేదా కొనేటప్పుడు, ఏదైనా అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వాస్తు దోషాలను తెలుసుకుంటాము.

అన్ని సక్రమంగా ఉన్నా కూడా కొన్ని సార్లు మన ఇళ్లలో ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది.అందుకు గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Best Vastu Tips For Positive Energy,vastu Tips, Drainage Water, Big Trees, Dust

మన ఇంటి ముఖద్వారం ఎదురుగా నీరు ప్రవహిస్తున్నట్లు గాని లేదా విద్యుత్ స్తంభాలు ఉంటే వాటి వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.అంతేకాకుండా కుటుంబంలో ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

ఏదైనా శుభకార్యం జరిగినా లేదా పండుగలు జరుపుకునేటప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరిస్తూ ఉంటారు.అయితే వాటిని మరుసటి రోజు ఉదయాన్నే పడేయాలి.

Advertisement

అవి ఎండిన తర్వాత అలాగే ఉండటం వల్ల ప్రతికూల వాతావరణాన్ని కలిగిస్తాయి.అంతేకాకుండా చెడు ప్రభావం ఇంటి మీద పడుతుంది.

మన ఇంటి ఆవరణంలో ఎత్తైన చెట్లు, లేదా పెద్ద పెద్ద వృక్షాలను పెంచకూడదు ఇలాంటి వృక్షాలు పెరగడం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని రాకుండా ఆపేస్తుంది.మన ఇంటి ప్రధాన తలుపు ఇతర తలుపుల కంటే పెద్దదిగా ఉండాలి, అంతే కాకుండా వాటిని ఎప్పుడూ సవ్య దిశలోనే తెరవాలి.

ప్రధాన తలుపు సమాంతరంగా ఒకే వరుసలో మూడు తలుపులు ఉండకూడదు.ఇది తీవ్రమైన వాస్తు లోపం గా పరిగణించబడుతుంది.

ఇలా ఉంటే వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి.మన ఇంటి వాతావరణం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20

అంతేకాకుండా ప్రధాన ద్వారం వద్ద డస్ట్ బిన్ లు, విరిగిన కుర్చీలను ఉంచకూడదు.ప్రధాన ద్వారం ఎదురుగా అద్దం ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితిని తిరిగి ప్రతిబింబిస్తుంది.

Advertisement

మన ఇంటి ముఖద్వారం ఎప్పుడు కూడా ఈ రహదారి కంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.రోడ్డు కంటే తక్కువ లో ఉండడం వల్ల ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.

ఇలా ఉంటే వీలైనంత త్వరగా మరమ్మత్తు చేయించుకుని రోడ్డు కంటే పై భాగంలో ఉండేలా చూసుకోవాలి.

తాజా వార్తలు