ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఇవే!

కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి కంపెనీ రికార్డులు సృష్టిస్తోంది.ఫిబ్రవరిలో అమ్ముడైన కార్ల లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగి పోతుంది.

 Best Selling Cars In The Month Of February Details, February Month, Automobile S-TeluguStop.com

సేల్ అయినటువంటి టాప్ -10 కార్లలో దాదాపు 7 కార్లు మారుతి మోడల్ కార్లు కావడం కొసమెరుపు.భారత ప్రజలు ఎక్కువగా హ్యాచ్ బ్యాక్ కార్ల కొనుగోలుకే వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇక టాప్ -10 కార్లలో 4 మాత్రమే SUV మోడళ్లు ఉన్నాయి.బ్రెజ్జా, నెక్సాన్, పంచ్, క్రేటా వంటి కార్లు ఉన్నాయి.

కాగా ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన SUVలలో మారుతి సుజుకి బ్రెజ్జా కారు టాప్ లో ఉండడం కొసమెరుపు.

ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరిలో 18,592 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా.తర్వాతి స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ 18,412 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో వుంది.ఇక మారుతి సుజుకి ఆల్టో 3వ స్థానం(18,114)లో ఉంది.టాప్-10 కార్లలో ఒక్క సెడాన్ మాత్రమే చోటు దక్కించుకుంది.మారుతి సుజుకి డిజైర్ 16,798 యూనిట్ల అమ్మకాలతో టాప్-10లో స్థానం దక్కించుకోవడం విశేషం.

ఆ తరువాతి స్థానాల్లో టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రేటా ఉన్నాయి.అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలను నమోదు చేసిన SUVగా టాటా పంచ్ స్థానం సంపాదించింది.

ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు:

1.మారుతి సుజుకి బాలెనో – 18,592 యూనిట్లు
2.మారుతి సుజుకి స్విఫ్ట్ – 18,412 యూనిట్లు
3.మారుతి సుజుకి ఆల్టో – 18,114 యూనిట్లు
4.మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 16,889 యూనిట్లు
5.మారుతి సుజుకి డిజైర్ – 16,798 యూనిట్లు
6.మారుతి సుజుకి బ్రెజ్జా – 15,787 యూనిట్లు
7.టాటా నెక్సాన్ – 13,914 యూనిట్లు
8.మారుతి సుజుకి ఈకో – 11,352 యూనిట్లు
9.టాటా పంచ్ – 11,169 యూనిట్లు
10.హ్యుందాయ్ క్రెటా – 10,421 యూనిట్లు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube