వేసవిలో పెసర పంట( Green Gram Cultivation )ను మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.ఎందుకంటే పెసర పంటను వేసవి పంటగా కూడా చెప్పవచ్చు.
ఆరంభం నుంచి తప్పకుండా యాజమాన్య పద్ధతులు పాటించాలి.వేసవిలో పెసరను సాగు చేసే రైతులు ఫిబ్రవరి నుంచి మార్చి 15వ తేదీ వరకు విత్తనం విత్తుకోవడానికి అనువైన సమయం.
మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తే ఒక ఎకరాకు 10 కిలోల విత్తనాలు అవసరం.వరి మాగాణులలో సాగు చేస్తే.
ఒక ఎకరాకు 14 కిలోల విత్తనాలు అవసరం.విత్తనాలను విత్తన శుద్ధి( Seed treatment ) చేసి విత్తుకుంటే వివిధ రకాల తెగుళ్లు రాకుండా పంట సంరక్షించబడుతుంది.
ముఖ్యంగా రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉండదు.
పెసర పంటలు అత్యంత కీలకం కలుపు నివారించడం.పెసర విత్తిన 24 గంటల్లోపు ఒక ఎకరాకు 1.25 లీటర్ల పెండిమిథాలిన్ ను 20 లీటర్ల నీటిలో కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.పైరు 25 రోజుల దశలో ఉన్నప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి.ఇలా చేస్తే కలుపు నివారించబడడంతో పాటు భూమి గుల్లబారి, తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
పంట 45 నుంచి 50 రోజుల మధ్యలో ఉన్నప్పుడు నీటి తడి కచ్చితంగా అవసరం.ఇలా చేస్తే పూత, పిందే ఎదుగుదల బాగుంటుంది.
ఇక పెసర పంటకు చీడపీడల, తెగుళ్ళ బెడద కాస్త ఎక్కువే.సకాలంలో వీటిని గుర్తించి తొలిదశలో అరికట్టాలి.పంట విత్తిన సమయం నుంచి చేతికి వచ్చే వరకు అన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి.పంట పక్వ దశను గుర్తించి, సరైన సమయంలో కోతలు చేయాలి.గింజల్లో తగినంత తేమశాతం వచ్చేవరకు ఆరబెట్టి, ఆ తర్వాత మార్కెటింగ్ చేయాలి.అప్పుడే పంటకు ఆశించిన స్థాయిలో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.