చీటికి మాటికి ఆకలి వేస్తుందా.. చిరుతిండ్లు కాదు రోజు ఇవి తినండి!

సాధారణంగా కొందరికి చీటికిమాటికి ఆకలి ( Excess hunger )వేస్తూనే ఉంటుంది.భోజనం చేసినా కూడా మళ్లీ కొద్దిసేపటికే ఆకలి ఫీలింగ్ కలుగుతుంది.

దీంతో చిరు తిండ్లపై పడి తెగ లాగించేస్తారు.క్యాలరీలను పెంచుకుని భారీగా బరువు పెరుగుతుంటారు.

ఫ‌లితంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు త‌లెత్తుతాయి.వీటన్నిటికి దూరంగా ఉండాలంటే మొట్టమొదట మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఆ ఆహారాలు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఓట్స్.( Oats ).అతి ఆకలిని దూరం చేయడానికి అద్భుతంగా తోడ్పడతాయి.ఓట్స్ లో పాలు, ఫ్రూట్ ముక్కలు,( Milk fruit slices ) చియా సీడ్స్ వంటివి కలిపి తీసుకుంటే మన శరీరానికి బోలెడన్ని పోషకాలు లభిస్తాయి.

ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది.చిరుతిండ్ల పై మనసు మళ్లకుండా ఉంటుంది.అదే సమయంలో వెయిట్ లాస్ కు, గుండె ఆరోగ్యానికి సైతం ఓట్స్ తోడ్పడతాయి.

అలాగే నట్స్,( Nuts ) సీడ్స్ అండ్ డ్రైడ్ ఫ్రూట్స్ ను రోజు తీసుకోవాలి.బాదం, పిస్తా, వాల్ నట్స్, ఖర్జూరం, కిస్మిస్, అంజీర్, ఆప్రికాట్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పుచ్చ గింజలు వంటి వాటిని డైట్ లో చేర్చుకోవాలి.

ఇవి డే మొత్తం ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహాయపడతాయి.అతి ఆకలిని దూరం చేస్తాయి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి .

Advertisement

ఇక చాలా మంది పాలిష్ రైస్ ను తీసుకుంటారు.ఈ రైస్ లో పోషకాలు ఏమీ ఉండవు.కేవలం షుగర్, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి.

ఈ పోలిష్ రైస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆకలి విపరీతంగా వేస్తుంటుంది.కాబట్టి పాలిష్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, గోధుమలు వంటివి తీసుకోండి.

ముడి బియ్యం కూడా తిన‌వ‌చ్చు.ఇవి వెర్రి ఆకలిని దూరం చేస్తాయి.

బ‌రువు కూడా అదుపులో ఉంచుతాయి.

తాజా వార్తలు