వేస‌విలో శ‌రీర వేడిని త‌గ్గించే బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

వేస‌వి కాలం ప్రారంభం అయింది.రోజురోజుకు ఎండ‌లు మండిపోతుండ‌డంతో.

ప్ర‌జ‌లు ఇంట్లో నుంచి బ‌య‌ట కాలు పెట్టేందుకే జంకుతున్నారు.

ఈ వేస‌వి కాలంలో చెమ‌ట‌లు, ఉక్క‌పోత‌తో పాటు దాహం, నీరసం, అలసట వంటి స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడ‌తాయి.

అలాగే వాతావ‌ర‌ణం ఉష్ణోగ్ర‌త‌ల‌తో పాటు శ‌రీర ఉష్ణోగ్ర‌తలు కూడా పెరిగిపోతుంటాయి.దీంతో శ‌రీర వేడిని ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

అయితే శ‌రీర వేడిని త‌గ్గించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మెంతులు.వేడిని త‌గ్గించి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మెంతులు చేదుగా ఉన్న‌ప్ప‌టికీ.

ప్ర‌తి రోజు వీటిలో ఏదో ఒక రూపంలో తీసుకుంటే.శ‌రీర వేడి త‌గ్గ‌డంతో పాటు బ‌రువు కూడా త‌గ్గుతారు,అలాగే వేసవిలో శరీరాన్ని కూల్ చేయ‌డంలో సోంపు కూడా గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో సోంపు గింజ‌ల‌ను పొడి మ‌రియు చిటికెడు ప‌టిక బెల్లం పౌడ‌ర్ వేసి బాగా క‌లిపి తీసుకోవాలి.ఈ సోంపు వాట‌ర్‌ ప్ర‌తి రోజు తీసుకుండే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది.

దానిమ్మ పండుకు శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణం ఉంది.ఈ వేస‌వి కాలంలో ప్ర‌తి రోజు ఒక దానిమ్మ పండు తింటే.వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
కుక్క కోసం వెరైటీ సూట్‌కేసు కొన్న ఎన్నారై.. దీని ధర ఎన్ని లక్షలో తెలిస్తే..!

శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు.

Advertisement

ఎన్నో పోష‌కాలు ఉండే పాలకూర కూడా శ‌రీర వేడిని త‌గ్గించ‌గ‌ల‌దు.కాబ‌ట్టి, స‌మ్మ‌ర్ త‌ర‌చూ పాల‌కూర వంట‌లు, పాల‌కూర జ్యూస్‌ తీసుకుంటే.

శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌టంతో పాటు వేసవిలో ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.ఇక వీటితో పాటు మ‌జ్జ‌గ‌, కొబ్బ‌రి నీరు, కీర దోస‌, యాపిల్‌, వెన్న తీసిన మ‌జ్జిగ, స‌బ్జా వంటివి కూడా త‌ర‌చూ తీసుకుంటే శ‌రీర వేడి త‌గ్గుముఖం ప‌డుతుంది.

తాజా వార్తలు