ఆర్థరైటిస్ ఉన్న‌వారు ఏయే ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

ఆర్థరైటిస్.ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న వ్యాధి ఇది.

కీళ్లకు వచ్చే అతి పెద్ద సమస్యే ఆర్థరైటిస్.ఈ వ్యాధి ఉన్న వారు కీళ్ల నొప్పి, వాపు, మంట‌ల‌తో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుంటారు.

ఈ క్ర‌మంలోనే వాటిని నివారించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్‌ను తెగ వాడుతుంటారు.కానీ, కొన్ని కొన్ని ఆహారాల‌ను తీసుకుంటే పెయిన్ కిల్ల‌ర్స్‌తో ప‌ని లేకుండానే ఆర్థరైటిస్ ను క్ర‌మంగా త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆర్థరైటిస్ ఉన్న‌వారు ఏయే ఆహారాలు తీసుకోవాలో ఓ చూపు చూసేయండి.ఆర్థరైటిస్ బాధితుల‌కు ప‌సుపు ఓ గొప్ప ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.

రోజూ ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో చిటికెడు ప‌సుపు మిక్స్ చేసి తీసుకుంటే గ‌నుక‌.అందులోని పోష‌కాలు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Best Foods For Arthritis Patient Best Foods, Arthritis Patient, Latest News, He
Advertisement
Best Foods For Arthritis Patient! Best Foods, Arthritis Patient, Latest News, He

అలాగే ఆర్థరైటిస్ ఉన్న వారు ప్ర‌తి రోజు ఒక క‌ప్పు గ్రీన్ టీను సేవించాలి.త‌ద్వారా అందులో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల నొప్పి, కీళ్ల వాపు వంటి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.

Best Foods For Arthritis Patient Best Foods, Arthritis Patient, Latest News, He

అంతే కాదు, అల్లం, వాల్ న‌ట్స్‌, బాదం, చియా సీడ్స్, చేప‌లు, ఫ్లాక్స్ సీడ్స్, పాల కూర‌, సోయా బీన్స్‌, సోయా పాలు, స్ట్రాబెర్రీస్‌, కిడ్నీ బీన్స్‌, బ్రొకోలీ, గ్రేప్స్, డార్క్ చాక్లెట్‌, ఓట్స్‌ వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం ద్వారా కూడా ఆర్థరైటిస్ నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.ఇక ఈ ఫుడ్స్‌తో పాటుగా ప్ర‌తి రోజూ చిన్న పాటి వ్యాయామాలు చేయాలి.రోజు వ్యాయామం చేస్తే కీళ్లు, కండరాలు బలపడి నొప్పులు దూరం అవుతాయి.

అలాగే ప్ర‌తి రోజూ త‌గినంత విశ్రాంతి తీసుకోవాలి.శ‌రీరానికి కావాల్సినంత‌ నీటిని అందించాలి.

ఒత్తిడిని త‌గ్గించుకోవాలి.తద్వారా ఆర్థరైటిస్ ల‌క్ష‌ణాలు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు