హృతిక్ రోషన్, ఎన్టీఆర్ భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటులు కావడంతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేసే హీరోలు అనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరనే ప్రశ్నకు సౌత్ ప్రేక్షకులు ఎన్టీఆర్ పేరు సమాధానంగా చెబుతుండగా నార్త్ ఆడియన్స్ మాత్రం హృతిక్ రోషన్ పేరును సమాధానంగా చెబుతున్నారు.
అయితే డ్యాన్స్ ను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఈ ఇద్దరు హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరకడానికి కూడా ఎంతో సమయం పట్టదని కామెంట్లు వినిపిస్తున్నాయి.వార్2 సినిమా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సాంగ్ ఉండనుందని తెలుస్తోంది.ఆ సాంగ్ తో ఈ ఇద్దరు హీరోలలో బెస్ట్ డ్యాన్సర్( Best Dancer ) ఎవరనే ప్రశ్నకు సులువుగానే సమాధానం దొరుకుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ డ్యాన్సింగ్( NTR Dance ) స్కిల్స్ అద్భుతమని చిన్న వయస్సులోనే కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారని డ్యాన్స్ విషయంలో తారక్ హృతిక్ ను డామినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.అదే సమయంలో హృతిక్ ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేమనే సంగతి తెలిసిందే.డ్యాన్స్ విషయంలో అటు ఎన్టీఆర్ ఇటు హృతిక్ స్టైల్, స్వాగ్( Hrithik Roshan Dance ) తో ఆకట్టుకుంటున్నారు.

వార్2 రిలీజ్ 2025 సంవత్సరంలో ఉండనుందని తెలుస్తోంది.వార్2( War 2 ) బాక్సాఫీస్ ను షేక్ చేయబోయే సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వార్2 సినిమాను ప్రముఖ బాలీవుడ్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాయని సమాచారం అందుతోంది.హృతిక్, ఎన్టీఆర్ కలిస్తే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
