ఉద్యోగస్తులు, వ్యాపారులు క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఏ పనికైనా డబ్బులు చేతిలో లేనప్పుడు అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి.
కానీ క్రెడిట్ కార్డు( Credit card ) ఉంది కదా అని ఎలా పడితే అలా వాడితే బిల్లు మోపడవుతుంది.దీంతో బిల్లు టైమ్ వచ్చేసరికి బిల్లు కట్టలేక ఇబ్బంది పడతారు.
బిల్లు టైమ్ కు కట్టకపోతే అధిక వడ్డీ పడుతుంది.డ్యూ డేట్ కల్లా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలి.
లేకపోతే అధిక వడ్డీతో పాటు భారీగా జరిమానాలు పడతాయి.దీంతో బిల్లు చెల్లించడం మరింత భారమవుతుంది.

దాదాపు అన్నీ బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి.క్రెడిట్ కార్డులపై అనేక ఆఫర్స్ ఉంటాయి.దీంతో వాటిని చూసుకుని మంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.తాజాగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్( IDFC bank ) కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది.
ఈ క్రెడిట్ కార్డుపై అనేక ఆఫర్లు ఉన్నాయి. ఫ్రీ ఫ్లైట్ టికెట్స్‌తో పాటు ఇంకెన్నో ఆఫర్లు ఉన్నాయి.
అవి ఏంటో ఇప్పుడు చూద్దామా.

ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్లబ్ విస్తారా, మాస్టర్ కార్డుతో కలిసి క్లబ్ విస్తారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కా( IDFC FIRST Credit Card )ర్డు పేరుతో లాంచ్ చేసింది.ఈ క్రెడిట్ కార్డు తీసుకుున్నవారికి ఉచితంగా ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టికెట్ వస్తుంది.అలాగే ఒక నెలలో రూ.లక్ష వరకు ఖర్చు చేస్తే ప్రతీ రూ.200 ఖర్చుకు 6 క్లబ్ విస్తారా పాయింట్స్ ఇస్తారు.అలాగే పెట్రోల్, ఇన్సూరెన్స్ యుటిలిటీ, అద్దె చెల్లించడం, వ్యాలెంట్ లాంటి ఖర్చులకు కూడా ఒక పాయింట్ వస్తుంది.ఇక ఏడాదిలో నాలుగు కాంప్లిమెంటరీ రౌండ్స్, 12 కాంప్లిమెంటరీ గోల్ఫ్ లెస్సన్స్, ఫ్లైట్, హెటల్ బుకింగ్ కు సంబంధించి రూ.10 వేల విలువైన రెండు క్లైయిమ్స్ లభిస్తాయి.ఏడాదికి 8 సార్లు డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ స్పా, లాంజ్ యాక్సెస్ లాంటి బెనిఫిట్స్ వస్తాయి.