మెరిసే స్కిన్ కావాలా..ఆరెంజ్ ఐస్ క్యూబ్సే బెస్ట్ ఆప్ష‌న్‌!

మెరిసే స్కిన్ కావాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, నేటి కాలంలో ఆ ఆదృష్టం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఉంటుంది.

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, స‌రైన స్కిన్ కేర్ లేక‌పోవ‌డం, కాలుష్యం, పోష‌కాల లోపం, త‌ర‌చూ మేక‌ప్ వేసుకోవ‌డం, స్కిన్‌కు ప‌డ‌ని ప్రోడెక్ట్స్ వాడ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం కాంతిహీనంగా మారుతుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క‌.

ఎలా చ‌ర్మాన్ని మెరిపించుకోవాలో అర్థంగాక‌.తెగ మ‌ద‌న ప‌డిపోతుంటారు.

అయితే స్కిన్‌ను మెరిపించ‌డంలో ఆరెంజ్ ఐస్ క్యూబ్స్ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.మ‌రి వాటిని ఎలా త‌యారు చేయాలి? ఎలా వాడాలి? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఆరెంజ్‌ల నుంచి ర‌సం తీసుకోవాలి.

Advertisement
Benefits Of Orange Ice Cubes For Skin! Benefits Of Orange Ice Cubes, Skin Care,

ఇప్పుడు ఆరెంజ్ ర‌సంలో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసి.ఐస్ ట్రేలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

నాలుగైదు గంట‌ల త‌ర్వాత ఆ ఐస్ క్యూబ్స్ తీసుకుని ముఖానికి, మెడ‌కు మ‌రియు చేతుల‌కు రుద్దుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే చ‌ర్మం అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఈ ఆరెంజ్ ఐస్ థెర‌పీ ప‌ని చేస్తుంది.

Benefits Of Orange Ice Cubes For Skin Benefits Of Orange Ice Cubes, Skin Care,

ముందుగా ఆరెంజ్ జ్యూస్ తీసుకుని అందులో చిటికెడు ప‌సుపు క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఐస్ ట్రేలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టి.ఐదారు గంట‌ల త‌ర్వాత ఐస్ క్యూబ్ తీసి మొటిములు ఉన్న ప్రాంతంలో రుద్దుకోవాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇలా చేస్తే చాలా త్వ‌ర‌గా మొటిమ‌లు పోతాయి.ముఖం మృదువుగా, ప్ర‌కాశ‌వంతంగా మారాలంటే.

Advertisement

ఆరెంజ్ జ్యూస్‌లో స్వ‌చ్ఛ‌మైన తేనె క‌లిపి, ఆ త‌ర్వాత ఐస్ ట్రేలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.నాలుగైదు గంట‌ల అనంత‌రం ఆ ఐస్ క్యూబ్స్ తీసుకుని ముఖానికి అద్దుకుని.

వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తాజా వార్తలు