నిమ్మరసం, పసుపు క‌లిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ప‌సుపు, నిమ్మ ర‌సం.ఈ రెండిటిని ప్ర‌తి ఒక్క‌రి ఇళ్ల‌ల్లోనూ విరి విరిగా వాడుతుంటారు.

ప‌సుపు, నిమ్మ రెండిటిలోనూ ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి.అందుకే ఇవి ఎన్నో జ‌బ్బుల‌ను కూడా నివారిస్తాయి.

అయితే ప‌సుపు, నిమ్మ విడి విడిగా ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.కానీ, ఈ రెండ‌టినీ క‌లిపి తీసుకుంటే మ‌రిన్ని బెనిఫిట్స్ పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిటికెడు ప‌సుపు మ‌రియు ఒక స్పూన్ నిమ్మ ర‌సం క‌లిపి సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు తీసుకుంటే.

Advertisement
Benefits Of Lemon Water, Turmeric Powder, Lemon Water, Lemon Water With Turmeri

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.ముఖ్యంగా కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారు.

రెగ్య‌ల‌ర్‌గా లేదా రెండు రోజుల‌కు ఒక సారి ఈ డ్రింక్ సేవించాలి.త‌ద్వారా ప‌సుపు మ‌రియు నిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల నొప్పుల‌ను క్ర‌మంగా త‌గ్గిస్తాయి.

Benefits Of Lemon Water, Turmeric Powder, Lemon Water, Lemon Water With Turmeri

అలాగే నేటి కాలంలో చాలా మంది అధిక బ‌రువుతో బాధ ప‌డుతుంటారు.అయితే బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు ప్ర‌తి రోజు గోరు వెచ్చ‌ని నీటిలో ప‌సుపు, నిమ్మ ర‌సం క‌లిపి తీసుకుంటే.శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

దాంతో వెయిట్ లాస్ అవుతారు.ప‌సుపు మ‌రియు నిమ్మ ర‌సం క‌లిపి తీసుకుంటే లివ‌ర్‌లో ఉండే వ్యర్థాలన్నీ కూడా బ‌య‌ట‌కు పోతాయి.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

దాంతో లివ‌ర్ వ్యాధులు దూర‌మై.ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

Advertisement

ఇక ప‌సుపు మ‌రియు నిమ్మ ర‌సంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ల‌క్ష‌ణాల‌తో పాటు విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి.అందువ‌ల్ల ఈ రెండిటిని గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకుంటే.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.దాంతో వైర‌స్‌లకు దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు