ప‌ర‌గడుపున బెల్లం తింటే..ఈ అదిరిపోయే బెనిఫిట్స్ మీసొంతం!

బెల్లం.ఎంత తియ్య‌గా, రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అందుకే బెల్లంతో త‌యారు చేసే స్వీట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి.

అయితే బెల్లంలో రుచే కాదుకాల్షియం, ఐర‌న్‌, సోడియం, పొటాషియం, జింక్‌, సెలీనియం, ప్రోటీన్, శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు కూడా నిండి ఉంటాయి.

అందు వ‌ల్ల‌నే బెల్లం ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అందులోనూ ప‌ర‌గ‌డుపున బెల్లంను తీసుకుంటే మ‌రిన్ని అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.

మ‌రి అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం పూట నీర‌సంగా క‌నిపిస్తుంటారు.

Advertisement

అయితే ప‌ర‌గ‌డుపున చిన్న బెల్లం ముక్క లేదా బెల్లం క‌లిపి వాట‌ర్‌ను తీసుకుంటే గ‌నుక‌ శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.దాంతో నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు దూర‌మై.

ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తారు.అలాగే కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారికి బెల్లం బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పాలి.

అవును, ఉద‌యాన్నే ఒక గ్లాస్ వాట‌ర్‌లో బెల్లంతో పాటుగా దంచిన చిన్న అల్లం ముక్క వేసి మ‌రిగించి.ఆ త‌ర్వాత‌ ఫిల్ట‌ర్ చేసి తీసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే ఎముక‌లు, కండ‌రాలు బ‌ల ప‌డ‌తాయి.దాంతో కీళ్ల నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

మ‌ల‌బ‌ద్ధ‌కం ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.అయితే ప‌ర‌గ‌డుపున చిన్న బెల్లం ముక్క‌ను తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డ‌టంతో పాటుగా మ‌ల‌బ‌ద్ధ‌కం, ఎసిడిటీ, గ్యాస్, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్యలు ప‌రార్ అవుతాయి.ఉద‌యాన్నే బెల్లంను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది.

Advertisement

మ‌తి మ‌రుపు త‌గ్గి.జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

అంతేకాదు, ప‌ర‌గ‌డుపున బెల్లం తింటే ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, గ్లోగా మారుతుంది.మ‌రియు శ్వాసకోశ స‌మ‌స్యలు నివార‌ణ అవుతాయి.అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విష‌యం ఏంటంటే.

హెల్త్‌కు మేల‌ని బెల్లం అతిగా తీసుకోవ‌డం చేయ‌రాదు.మ‌రియు స్వ‌చ్ఛ‌మైన బెల్లాన్నే వాడాలి.

తాజా వార్తలు