బెల్లం, శ‌న‌గ‌ప‌ప్పు క‌లిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

బెల్లం, శ‌న‌గ‌ప‌ప్పు.ఈ రెండూ విడి విడిగా రుచిగా ఉంటాయి.ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌ల‌గి ఉంటాయి.

అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.అయితే విడి విడిగా కంటే క‌లిపి తీసుకుంటే మ‌రిన్ని ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చ‌ని మీకు తెలుసా.? అవును, బెల్లం మ‌రియు శ‌న‌గ ప‌ప్పు క‌లిపి తిన‌డం వ‌ల్ల‌ శ‌రీరానికి మ‌స్తు బెనిఫిట్స్ ల‌భిస్తాయి.మ‌రి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

స్త్రీలు మ‌రియు చిన్న పిల్ల‌ల్లో అధికంగా క‌నిపించే స‌మ‌స్య ర‌క్త హీన‌త.అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డంలోనూ బెల్లం, శ‌న‌గ ప‌ప్పు కాంబినేష‌న్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

బెల్లం మ‌రియు శ‌న‌గ ప‌ప్పు రెండిటిలోనూ ఐరన్ ఉంటుంది.అందు వ‌ల్ల, ఈ రెండిటినీ క‌లిపి తీసుకుంటే శ‌రీరంలో ఐర‌న్ కొర‌త ఏర్ప‌కుండా ఉంటుంది.

Advertisement

దాంతో ఎర్ర ర‌క్త క‌ణాలు పెరిగి ర‌క్త హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.

అలాగే బెల్లం, శ‌న‌గ ప‌ప్పు క‌లిపి తీసుకుంటే అధిక బ‌రువును తీసుకోవ‌చ్చు.అదెలా అంటే ఈ రెండు ఆహార ప‌దార్థాల్లోనూ పీచు పదార్థం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.ఇవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి.

కాబట్టి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.దాంతో చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

ఫ‌లితం బ‌రువు త‌గ్గుతారు.ఇక బెల్లం, శ‌న‌గ ప‌ప్పు క‌లిపి తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

దాంతో గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదు, బ‌ల‌హీన‌మైన ఎముక‌లు దృఢంగా మార‌తాయి.

Advertisement

మోకాళ్ల‌ నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.

మ‌రియు గుండె ఆరోగ్యం సైతం మెరుగు ప‌డుతుంది..

తాజా వార్తలు