Drip Irrigation : వ్యవసాయంలో బిందు సేద్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. పాటించాల్సిన మెళుకువలు..!

వ్యవసాయంలో అత్యంత కీలకం సాగునీరు.ఏ పంట సాగు చేసిన పూత, పిందె దశలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తడం వల్ల దిగుబడి ఎంత తగ్గుతుందో రైతులకు తెలిసిందే.

 Benefits Of Drip Irrigation In Agriculture Techniques To Be Followed-TeluguStop.com

కాబట్టి పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి అనుగుణంగా వ్యవసాయానికి నీతి అవసరం కూడా బాగా పెరిగిపోతోంది.రోజురోజుకు మంచినీటి వనరుల లభ్యత జరుగుతూ ఉండడంవల్ల, కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కాబట్టి రైతులు బిందు సేద్యం( Drip irrigation ) అంటే సూక్ష్మ నీటిపారుదల విధానం ద్వారా పంటలను సాగు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

Telugu Agriculture, Crop Yield, Drip, Farmers, Yields, Techniques-Latest News -

బిందు సేద్య పద్ధతిలో తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలను సాగు చేయవచ్చు.నీటి వనరులు తక్కువగా ఉండే ప్రాంతంలో బిందు సేద్య పద్ధతి ద్వారా నీటిని అందిస్తే, ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే అనవసరంగా నీరు వృధా అయ్యే అవకాశం ఉండదు.

పైగా కలుపు సమస్య కూడా చాలావరకు తక్కువగా ఉంటుంది.కలుపు సమస్య లేకపోతే వివిధ రకాల చీడపీడలు( Pests ) లేదంటే తెగుళ్లు పంటను ఆశించలేవు.

ఒకవేళ ఆశించిన కూడా వ్యాప్తి అనేది ఎక్కువగా ఉండదు.కాబట్టి రసాయన పిచికారి మందుల పెట్టుబడి వ్యయం చాలావరకు తగ్గుతుంది.

దీంతో నాణ్యమైన పంట దిగుబడి( Crop yield ) పొందడానికి అవకాశం ఉంటుంది.

Telugu Agriculture, Crop Yield, Drip, Farmers, Yields, Techniques-Latest News -

బిందు సేద్యం ద్వారా సాగు చేసే రైతులు డ్రిప్ పరికరాలు సమర్థవంతంగా పనిచేయాలంటే.ఈ మెళుకువలు పాటించాలి.ఫిల్టర్స్, ఫ్లష్ వాల్స్ లను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ, శుభ్రం చేస్తూ ఉండాలి.

డ్రిప్ పైపులలో మలినాలు ఏవైనా పేరుకు పోతే నీటి సరఫరా తగ్గుతుంది.కాబట్టి పైపులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ యాసిడ్ తో శుభ్రపరచుకోవాలి.

బిందు సేద్యం ద్వారా సాగు చేసే రైతులు పంటకు కావలసిన ఎరువుల విషయానికి వస్తే.నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ విధానం ద్వారా పంటకు అందిస్తే చాలా వరకు కూలీల ఖర్చు తగ్గుతుంది.

ఇలా ఎరువులను అందించే విధానాన్ని ఫెర్టిగేషన్ అంటారు.ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలను డ్రిప్ విధానం ద్వారా పంటకు అందించవచ్చు.

పైగా ఈ పద్ధతి ద్వారా ఎరువుల వృధా తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube