అలోవెరా ఆయిల్‌.. వారంలో 2 సార్లు రాస్తే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

అలోవెరా(క‌ల‌బంద‌).దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంటి పెర‌టిలోనూ క‌ల‌బంద మొక్క త‌ప్ప‌కుండా ఉంటుంది.

ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా క‌ల‌బంద అందించే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు.

అలాగే కేశ సంర‌క్ష‌ణ‌లోనూ అలోవెరా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా అలోవెరాతో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా ఆయిల్‌ను చేసుకుని వాడితే అనేక జుట్టు స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అలోవెరా ఆయిల్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా రెండు లేదా మూడు క‌ల‌బంద ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు మిక్సీ జార్‌లో క‌ట్ చేసి పెట్టుకున్న క‌ల‌బంద ముక్క‌లు వేసి మెత్త‌గా గ్రౌండ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ మీద మంద‌పాటి గిన్నె పెట్టుకుని.

అందులో ఐదు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె మ‌రియు క‌ల‌బంద మిశ్ర‌మం వేసి స్మూన్‌తో తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్‌పై పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఆ మిశ్ర‌మాన్ని ఫిల్ట‌ర్ చేస్తే.

అలోవెరా ఆయిల్ సిద్ధం అవుతుంది.ఆపై ఈ ఆయిల్‌ను ఒక బాటిల్‌లో ఫిల్‌ చేసుకుంటే గ‌నుక ఎన్ని రోజులైనా వాడుకోవ‌చ్చు.

రాత్రి నిద్రించ‌డానికి గంట ముందు ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి బాగా మ‌సాజ్ చేసుకుని ప‌డుకోవాలి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

చుండ్రు నుంచి విముక్తి ల‌భిస్తుంది.జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

Advertisement

వైట్ హెయిర్ స‌మ‌స్య త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.ఒక‌వేళ తెల్ల జుట్టు ఉన్నా.

క్ర‌మంగా న‌ల్ల‌బ‌డుతుంది.ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి కాబ‌ట్టి.

త‌ప్ప‌కుండా అలోవెరా ఆయిల్‌ను త‌యారు చేసుకుని వాడేందుకు ప్ర‌య‌త్నించండి.

" autoplay>

తాజా వార్తలు