బెల్లంకొండ చిన్నబ్బాయికి స్వాతిముత్యంతో ప్రయోజనం ఎంత?

బెల్లంకొండ సురేష్ పెద్దబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఆయన హిందీలో చత్రపతి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

 Bellamkonda Sai Ganesh Swathimuthyam Movie Talk,,swathimuthyam,bellamonda Sai Ga-TeluguStop.com

ఈ సమయంలో బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు సాయి గణేష్ హీరోగా స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.సాయి గణేష్ కి స్వాతిముత్యం మొదటి సినిమా అన్నట్లుగా కాకుండా చాలా రోజులుగానే ఆయన ఇండస్ట్రీలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ప్రమోషన్ కార్యక్రమంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అయ్యారు.ఎందుకంటే రెగ్యులర్ గా సాయి గణేష్ గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇక స్వాతిముత్యం సినిమా తీసుకుంటే సాయి గణేష్ కి ఆ సినిమా ఎంత వరకు కెరియర్ లో హెల్ప్ అయ్యింది.అవ్వబోతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

స్వాతిముత్యం సినిమా వసుళ్ళ పరంగా నిరాశ పర్చిందనే చెప్పాలి, అందు కారణం దసరా కానుకగా ఈ సినిమా విడుదలైంది.

Telugu Bellamondasai, Chiranjeevi, Dasara, Nagarjuna, Nenu Sir, Telugu, Swathimu

అదే రోజు చిరంజీవి మరియు నాగార్జున లు నటించిన సినిమాలు కూడా విడుదల అయ్యాయి.కనుక స్వాతిముత్యం సినిమాకు పాజిటివ్ టాక్ దక్కినా వసూలు మాత్రం పాజిటివ్ గా లేవనే చెప్పాలి.మొదటి సినిమాతోనే కాస్త డేరింగ్ స్క్రిప్ట్ ఎంపిక చేసుకున్న బెల్లంకొండ గణేష్ బాబు కచ్చితంగా భవిష్యత్తులో మంచి సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మొదటి సినిమాతో హీరోగా మంచి గుర్తింపును అయితే దక్కించుకున్నాడు.సినిమా ఫ్లాప్ అయినా కూడా చిరంజీవి మరియు నాగార్జున వంటి పెద్ద హీరోలకు పోటీగా రావడంతో జనాల్లో బెల్లంకొండ సాయిగా గణేష్ బాబు నోటెడ్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం గణేష్ నేను స్టూడెంట్ సార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.రెండవ సినిమా కూడా కాస్త విభిన్నంగానే సాయి గణేష్ ప్లాన్ చేసినట్లుగా టైటిల్ ని చూస్తుంటే అనిపిస్తోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి రెండవ సినిమా నేను స్టూడెంట్ సర్ తో అయినా గణేష్ బాబు కమర్షియల్ గా సక్సెస్ ని దక్కించుకుంటాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube