టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Tamanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది తమన్నా.అంతేకాకుండా సినిమాలతో పాటుగా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో తమన్నా పేరు మారుమోగుతుంది.ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
కాగా ఈ మిల్క్ బ్యూటి గత ఏడాది వచ్చిన జైలర్ సినిమాలో( Jailer Movie ) నువ్వు కావాలయ్యా.నువ్వు కావాలయ్యా అనే స్పెషల్ సాంగ్‌తో దుమ్మురేపిన విషయం తెలిసిందే.అందులో డాన్స్‌తో పాటు అందంతో కూడా కట్టిపడేసింది మిల్క్ బ్యూటీ.సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో ఈ సాంగ్ ఇప్పటికి ట్రెండింగ్‌లోనే ఉందంటే అతిశయోక్తి కాదు.అయితే ఈ సాంగ్‌కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.తమన్నపై నెట్టింట ఎన్నో ట్రోల్స్ జరిగాయి.
ఈ మేరకు తాజాతా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ట్రోలర్స్‌కు( Tamanna Trollers ) సూపర్ ఆన్సర్ ఇచ్చింది.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా తమన్నా మాట్లాడుతూ.స్పెషల్ సాంగ్స్‌లో( Special Songs ) నటించడం, గ్లామర్ ప్రదర్శించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం మాత్రమే.నిజానికి జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా సాంగ్( Nuvvu Kavalayya Song ) చేసినప్పుడు కొందరు దారుణంగా కామెంట్స్ చేశారు.
అవి చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది.అసలు చెప్పాలంటే ఇలాంటి గ్లామరస్ సాంగ్స్‌లో నటించడం తప్పే కాదు.ఫస్ట్ ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్‌సెట్ మారాలి అంతే అని చెప్పుకొచ్చింది తమన్నా.