భారత జట్టులో చోటు దక్కాలంటే కచ్చితంగా రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే అని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ యువ ఆటగాళ్లు బీసీసీఐ( BCCI ) బోర్డ్ ఆదేశాలను ధిక్కరించిన సంగతి తెలిసిందే.
ఇషాన్ కిషన్( Ishan Kishan ) రంజీ ట్రోఫీలో ఆడకుండా, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడం, శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) వెన్ను గాయం సాకు చెప్పి ANCA లో ఉండిపోవడం వల్ల వీరిపై బీసీసీఐ సీరియస్ గా ఉంది.రెడ్ బాల్ క్రికెట్ పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
టెస్ట్ మ్యాచ్( Test Match ) ఆడే ఆటగాళ్ల ఫీజు పెంచాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.

అంతేకాదు ఒక ఆటగాడు క్యాలెండర్ ఇయర్ లో మొత్తం అన్ని సిరీస్ లలో ఆడితే, ఆటగాడి వార్షిక కాంట్రాక్ట్ రిటైన్ తో పాటు అదనంగా రివార్డ్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ఆడెందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపించే అవకాశం ఉందని, బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.ప్రస్తుతం ఉండే మ్యాచ్ ఫీజులను( Match Fees ) ఒకసారి గమనిస్తే.

ఒక్కో టెస్టుకు మ్యాచ్ ఫీజు రూ.15 లక్షలు, ఒక్కో వన్డే మ్యాచ్ ఫీజు రూ.6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలు.అయితే తాజాగా పెంచిన ఫీజు ప్రకారం ఒక్కో టెస్ట్ మ్యాచ్ ఫీజు రూ.20 లక్షలకు పెంచాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత కొత్త ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.







