రోహిత్ శర్మకు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్.. ఎందుకో తెలుసా..?

రోహిత్ శర్మ( Rohit Sharma ) భారత జట్టుకు కెప్టెన్ గా తనదైన శైలిలో జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) లో భారత జట్టును ఓటమి అనేది ఎరుగకుండా లీగ్ దశ నుండి నేరుగా ఫైనల్ కు చేర్చి ఒక్క అడుగు దూరంలో భారత జట్టుకు కప్పు అందించడంలో కాస్త తడపడ్డాడు.

ప్రపంచ దేశాలు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ అత్యుత్తమంగా ఉందని చాలా గొప్పగా ప్రశంసించాయి.క్రికెట్ మ్యాచ్ అన్నాక గెలుపు ఓటములు సహజం.

కానీ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ వ్యవహరించే తీరును బట్టి ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంది.జట్టులో ఉండే బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో కెప్టెన్ రోహిత్ శర్మకు తెలిసిన విధంగా మరో కెప్టెన్ కి తెలియదేమో అనే విధంగా తన కెప్టెన్సీ ఉంటుంది.

Bcci Special Request To Rohit Sharma Do You Know Why , Rohit Sharma, Bcci , Odi

అయితే రోహిత్ శర్మ టెస్ట్, వన్డేలపై మరింత ఫోకస్ పెట్టేందుకు టీ20 మ్యాచ్( T20 match ) ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే త్వరలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగే టీ20 సిరీస్ లో జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాలని బీసీసీఐ రోహిత్ శర్మను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.2024 టీ20 వరల్డ్ కప్ వచ్చేసరికి ఓ కొత్త కెప్టెన్ ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో బీసీసీఐ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తే బాగుంటుందని బీసీసీఐ కోరుతోంది.

Bcci Special Request To Rohit Sharma Do You Know Why , Rohit Sharma, Bcci , Odi
Advertisement
BCCI Special Request To Rohit Sharma Do You Know Why , Rohit Sharma, BCCI , ODI

ప్రస్తుతం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ( India vs Australia )మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.హార్దిక్ పాండ్యాకు గాయం అవ్వడం వల్లనే టీ20 సిరీస్ ఆడే భారత జట్టు లో కెప్టెన్లను మార్చాల్సి వస్తోంది.ఒకవేళ రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లకి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇక హార్దిక్ పాండ్యా ఫుల్ టైం కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు