ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్( Ishaan Kishan, Shreyas Iyer ) లను రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ( BCCI ) పదేపదే హెచ్చరించిన ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు పట్టించుకోలేదు.ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు దూరమైనప్పటి నుంచి ఇషాన్ కిషన్ భారత్ తరపున ఆడలేదు.
ఇక ఇంగ్లాండ్ తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్ల కోసం భారత జట్టు నుంచి అయ్యర్ ను తొలగించారు.ఆ తరువాత ఈ ఇద్దరు యువ ప్లేయర్లకు దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించింది.
కానీ ఈ ఇద్దరు ప్లేయర్లు రంజీ ట్రోఫీలో ఆడలేదు.దీంతో వీరిపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకుంది.

2023-24 సీజన్ కు సంబంధించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులకు లోబడి ఉన్న ఆటగాళ్ల జాబితాను మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.రంజీ ట్రోఫీలో ఆడక పోవడం వల్ల ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ లను ఈ జాబితా నుంచి బీసీసీఐ పూర్తిగా మినహాయించింది.అంటే వీరిద్దరికీ బీసీసీఐ నుంచి వార్షిక వేతనంగా కనీసం ఒక్క రూపాయి కూడా లభించదు.ఈ ఇద్దరు ప్లేయర్లు రంజీ ట్రోఫీలో( Ranji Trophy ) ఆడక పోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అజిత్ అగార్కర్( Ajit Agarkar ) నేతృత్వంలోని సెలెక్టర్లు 2023-24 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేశారు.త్వరలోనే బీసీసీఐ ఈ జాబితాను ప్రకటించనుంది.

ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్ తరపున కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఇక శ్రేయస్ అయ్యర్ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఏకైక రంజీ ట్రోఫీ మ్యాచ్లో ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు కానీ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ కు అందుబాటులో లేడు.అయ్యర్ ఫిట్ గా ఉన్న ఆడక పోవడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రకటన షూటింగ్ కు హాజరవడం పట్ల బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.బీసీసీఐ ఆదేశించిన కూడా రెడ్ బాల్ క్రికెట్ ఆడని ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.