తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బర్రెలక్క శిరీష( Barrelakka Sirisha ) ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.ఆమె తండ్రి ఆమె గురించి నెగిటివ్ గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
మా నాన్న గురించి నేను ఎక్కడా చెప్పలేదని ఆయన గురించి తప్పుబడితే మా కుటుంబంను మేము తప్పు పట్టుకున్నట్టు ఉంటుందని ఆమె కామెంట్లు చేశారు.మా నాన్న మెంటల్ కండీషన్ దెబ్బ తిన్నదని బర్రెలక్క శిరీష పేర్కొన్నారు.
నేను ప్రశ్నిస్తా కాబట్టి తండ్రి నెగిటివ్ గా కామెంట్లు చేస్తారని ఆమె పేర్కొన్నారు.మా అమ్మను మా నాన్న కొట్టడం వల్ల వెన్నుముకలో క్రాక్ వచ్చిందని శిరీష తెలిపారు.
డబ్బు, బంగారం తీసుకొని మా నాన్న వెళ్లిపోయాడని ఆమె తెలిపారు.ఇంటికి తీసుకొచ్చినా ఆయన మళ్లీ ఇంటినుంచి వెళ్లిపోయారని శిరీష పేర్కొన్నారు.
మా ఇంట్లో ఏం జరిగిందో యూట్యూబ్ ఛానెల్ వాళ్లకు ఎలా తెలుస్తుందని ఆమె అన్నారు.
మా నాన్నతో ఎవరో చెప్పించారని నా గురించి చెడుగా చెప్పడాని ఏకంగా లక్ష రూపాయలు ఇచ్చారని శిరీష తెలిపారు.నాన్నతో మాటాడి మూడున్నర సంవత్సరాలు అయిందని ఆమె అన్నారు.మా నాన్న ఇంటికి వచ్చేవాడు కానీ ఎప్పుడో వచ్చేవాడని అమ్మను తిట్టేవాడని శిరీష కామెంట్లు చేశారు.
మా నాన్న శ్రీశైలంలో( Srisailam ) బిచ్చం అడుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.
నేను చిన్న ఛానల్ కు సైతం ఇంటర్వ్యూ ఇచ్చానని శిరీష కామెంట్లు చేశారు.నా గురించి తప్పుగా ప్రచారం చేసేవాళ్లు ఆలోచించుకోవాలని శిరీష వెల్లడించారు.శిరీష 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
బర్రెలక్క శిరీష రాబోయే రోజుల్లో అయినా ఎన్నికల్లో గెలవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.