Pawan Kalyan RGV: పవర్ స్టార్ పవన్ కంటే బర్రెలక్క బెటర్ అన్న ఆర్జీవీ.. వర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఒకవైపు సినిమాలను తెరకెక్కిస్తూనే మరొకవైపు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.

 Barrelakka Is Better Than Pawan Kalyan Rgv Post Viral-TeluguStop.com

ఒక రకంగా చెప్పాలంటే వర్మ సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారానే బాగా హైలైట్ అయ్యారని చెప్పవచ్చు.ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను రూపొందించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కేవలం వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఏపీలో త్వరలో ఎన్నికలు( AP Elections ) జరగనుండగా ఆ ఎన్నికలను టార్గెట్ చేస్తూ వ్యూహం, శపధం అనే రెండు సినిమాలను తెరకెక్కించారు.

అందులో వ్యూహం( Vyooham ) సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో వర్మ కి సెన్సార్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది.దీంతో రిలీజ్ పనుల్లో ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్న రాంగోపాల్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విమర్శించడానికి మాత్రం తగిన సమయాన్ని కేటాయిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వర్మ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.

ఇంతకంటే దారుణమైన, అసలు ఏమాత్రం ఆసక్తి లేని, అజాగ్రత్తతో కూడిన ప్రచారాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు.పవన్ తెలంగాణలో పర్యటిస్తున్నాడు.

అతను మాట్లాడుతున్న మైక్ సౌండ్ గురించి అతను పట్టించుకోవడం లేదు సరి కదా నిర్వాహకులు కూడా పట్టించుకోవడం లేదు.పవన్ కళ్యాణ్ తో పోలిస్తే బర్రెలక్క( Barrelakka ) చాలా బెటర్ గా ప్రచారం చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ ను బర్రెలక్కతో పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు వర్మ.ఆ కామెంట్స్ వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్.అందటితో ఆగని రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై మరొక ట్వీట్ కూడా చేశారు.పవన్ కళ్యాణ్ గత ప్రచారాల వీడియోలు చూస్తుంటే ఆయన ప్రచారానికి రావడం ఆర్గనైజర్లకు ఏమాత్రం ఇష్టం లేదేమో అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube