బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 8 రోజులు మూతపడనున్నాయ్!

బ్యాంకులలో మీకు ఏవైనా పనులున్నాయా? అయితే వెంటనే మీరు అప్రమత్తం కావాల్సిందే.ఎందుకంటే ప్రస్తుతం దసరా పండగ సీజన్.

 Banks Will Be Closed For 8 Consecutive Days , Bank , Holidays, List, Workes, Emp-TeluguStop.com

దీని వల్ల బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి.రానున్న 11 రోజుల్లో బ్యాంకులకు ఏకంగా 8 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

దీంతో బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడి ఉంటాయి.వరుస పండుగ సెలవుల వల్ల మీకు బ్యాంకు పనులు ఉంటే మీరు త్వరితగతిన మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలి.

ఆర్‌బీఐ బ్యాంక్ హాలిడే క్యాలెండర్( RBI Bank Holidays ) ప్రకారం, దుర్గా పూజ కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేర్వేరు రోజులలో మూసివేయబడతాయి.అదే సమయంలో, దుర్గాపూజ తర్వాత దసరాతో పాటు ఇతర పండగల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

ఇది కాకుండా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కారణంగా ఈ నెలాఖరు వరకు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.ఏ రోజు, ఎక్కడ బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకుందాం.

Telugu Bank, Employees, Holders, Holidays, List-Latest News - Telugu

21 అక్టోబర్ తేదీలో దుర్గా పూజ (మహా సప్తమి) సందర్భంగా అగర్తల, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతాలో బ్యాంకులు పని చేయవు.23 అక్టోబర్ దసరా/శాస్త్ర పూజ/దుర్గాపూజ/విజయదశమి పండగ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులు మూతపడతాయి.

Telugu Bank, Employees, Holders, Holidays, List-Latest News - Telugu

24 అక్టోబర్ నాడు దసరా/దసరా (విజయదశ)/దుర్గాపూజ సందర్భంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా ఆల్ ఇండియా బ్యాంకులు మూసివేయబడతాయి.25 అక్టోబర్ తేదీన దుర్గా పూజ వల్ల గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పని చేయవు.26 అక్టోబర్ నాడు దుర్గా పూజ వల్ల గాంగ్టక్, జమ్ము, శ్రీనగర్‌లలో, 27 అక్టోబర్ దుర్గా పూజ వల్ల గాంగ్టక్‌లో బ్యాంకులు హాలిడే.ఇక 28 అక్టోబర్ నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.28 అక్టోబర్ లక్ష్మీ పూజ వల్ల కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 29 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.

అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వల్ల అహ్మదాబాద్‌లో బ్యాంకులు పని చేయవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube