ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ నగరంగా బెంగళూరు సిటీ....

ప్రస్తుతం ప్రపంచ లోని పలు పేరొందిన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి.

దీంతో ప్రపంచంలోనే ఈ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న నగరాల గురించి ప్రముఖ  టామ్ టామ్ సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది.

ఇందులో భాగంగా తాజాగా ఈ అధ్యయనం గురించి సర్వే వివరాలను వెల్లడించింది.ఇందులో  భాగంగా ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాఫిక్ రద్దీ ఉన్నటువంటి నగరంగా కర్ణాటకలోని బెంగళూరు నగరం మొదటి స్థానంలో నిలిచింది.

అంతేగాక  భారతదేశంలో మిగిలిన స్థానాల్లో ముంబై, పూణే, ఢిల్లీ, తదితర నగరాలు నిలిచాయి.అయితే ఇదిలా ఉండగా ప్రపంచంలో ఇస్తాంబుల్ లీమా, జకర్తా, మాస్కో,  మనీలా వంటి నగరాలు ప్రపంచంలో ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగుళూరు నగరం తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అయితే ఈ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు తమ ఎక్కువ సమయాన్ని ట్రాఫిక్ లోనే గడుపుతున్నారని కూడా వెల్లడించింది.ఈ క్రమంలో బెంగళూరు నగరంలో నివసించే వారు దాదాపుగా ఏడాదిలో 243 గంటల కంటే ఎక్కువ సేపు రోడ్లపై నడుపుతున్నట్లు తెలుస్తోంది.ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత సమయం రోడ్లపైన గడపాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Advertisement

అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.ప్రస్తుతం బెంగళూరు నగరంలో సగటున ప్రతి ఒక్కరికి మోటారు వాహనాలు కలిగి ఉన్నారు.

దీంతో వాతావరణ కాలుష్యం మరియు ఇంధన వినియోగం సమస్యలు వంటివి విపరీతంగా పెరిగిపోయాయి.

Advertisement

తాజా వార్తలు