దాసరిపైనే సెటైర్‌ వేశాడు

దర్శకరత్న దాసరి నారాయణ రావు తాజాగా అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న విషయం తెల్సిందే.

ఆ ఆడియో వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను దాసరి చేశాడు.

అప్పట్లో ఎన్టీఆర్‌, ఎయన్నార్‌, కృష్ణ ఇప్పుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌లు మాత్రమే నటనలో శిఖరాన నిలిచిన వారు అంటూ దాసరి కామెంట్స్‌ చేశాడు.ఈ క్రమంలో చిరంజీవి గురించి దాసరి స్పందించక పోవడంతో చర్చనీయాంశం అయ్యింది.

త్వరలో పవన్‌ కళ్యాణ్‌తో దాసరి ఒక సినిమా నిర్మించనున్నాడు కనుక అలా అని ఉంటాడు అని కొందరు సర్ది చెప్పుకుంటుంటే, మరి కొందరు మాత్రం దాసరి వ్యాఖ్యలపై కౌంటర్‌ వేస్తున్నారు.భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్‌కు పవన్‌ కళ్యాణ్‌ అంటే ప్రాణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పవన్‌ గురించి ఎప్పటికప్పుడు కొత్తగా మాట్లాడుతూ, ఆకాశానికి ఎత్తేస్తాడు.తాజాగా దాసరి పవన్‌ గురించి మాట్లాడినా కూడా ఆయనపై బండ్ల బాబు సెటైర్లు వేయడం జరిగింది.

Advertisement

చిరంజీవి గారి గురించి ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడాడు.టాలీవుడ్‌ను చిరంజీవి లేకుండా ఊహించుకోలేము.

రాముడు లేని రామాయణంలాగా చిరు లేని టాలీవుడ్‌ లేదు అంటూ దాసరి వాఖ్యలపై బండ్ల గణేష్‌ సెటైర్‌ వేశాడు.

Advertisement

తాజా వార్తలు