ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చారు.చరణ్ కు నాకు గొడవలు ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు.
యువరాజు లక్షణాలు ఉన్న వ్యక్తి రామ్ చరణ్ అని బండ్ల గణేష్ వెల్లడించారు.టాలీవుడ్ స్టార్స్ అందరూ మంచోళ్లేనని వాళ్లు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ఆయన కామెంట్లు చేశారు.
అభిమానులను నేను ఎప్పుడూ రెచ్చగొట్టలేదని బండ్ల గణేష్ తెలిపారు.కేసీఆర్ చేసిన పనులు చేసి నేను పొగుడుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వరి ఎగుమతి చేస్తున్నామని బండ్ల గణేష్ పేర్కొన్నారు.నేను డైరెక్ట్ గానే ట్వీట్లు చేస్తానని ఆయన అన్నారు.
నాకున్న వ్యాపారాలతో పోల్చి చూస్తే సమస్య చిన్నదని నా దగ్గర 1000 మంది పని చేస్తారని బండ్ల గణేశ్ తెలిపారు.
నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని గౌరవించాలని ఆయన కామెంట్లు చేశారు.అమరావతి భూముల గురించి నాకు నిజంగా తెలియదని నేను ఇప్పటివరకు అమరావతి చూడలేదని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
మామయ్య కూతురిని పెళ్లి చేసుకున్నానని ఆయన వెల్లడించడం గమనార్హం.
నువ్వు హైదరాబాద్ లో ఎందుకు షాద్ నగర్ వెళ్లి కోళ్ల వ్యాపారం చేసుకో అని కొంతమంది అన్నారని అలా అవమానించిన వాళ్లు చనిపోయారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.నేను మందు తాగనని నేను ఇప్పటివరకు ఏ తప్పు పని చేయలేదని ఆయన తెలిపారు.నిర్మాతగా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్న బండ్ల గణేష్ రాబోయే రోజుల్లో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.