ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ పిలుపునిచ్చింది.నిన్న జరిగిన కుప్పం ఘటనకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనుంది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహానిర్బంధం చేస్తున్నారు.అటు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
దీంతో ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం జారీ చేసిన జీవో -1 నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోన్నారు.దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం తీవ్ర రూపం దాల్చింది.
మరోవైపు చంద్రబాబు కుప్పంలో రెండో రోజు పర్యటించనున్నారు.







