ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) అందరికీ సుపరిచితుడే.సినిమా రంగంలో కమెడియన్ గా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ అనతి కాలంలోనే నిర్మాతగా మారారు.
పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం జరిగింది.
కాగా ఒకపక్క సినిమా రంగంలో నిర్మాతగా రాణిస్తూనే మరోపక్క రాజకీయాలలో కూడా బండ్ల గణేష్ రాణిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్( Congress ) పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తనవంతుగా ప్రచారం చేయడం జరిగింది.కొన్ని ఎలక్ట్రానిక్ పలు వెబ్ మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే న్యూ ఇయర్ సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండ్ల గణేష్ కలిశారు.ఈ సందర్భంగా ఓ పూల మొక్కను బహుమతిగా అందించారు.
ఒక బండ్ల గణేష్ మాత్రమే కాదు చాలామంది పలువురు నాయకులు, ప్రముఖులు సీఎం రేవంత్ నీ కలసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.