రవితేజపై పడ్డావేంటి బండ్లన్న.. డేట్లు ఇస్తాను అన్నాడా?

నటుడిగా ఎన్నో సినిమాలు నటించి ఆ తర్వాత నిర్మాత గా పరిచయం అయిన బండ్ల గణేష్ పలువురు స్టార్ హీరోలతో సినిమా లను నిర్మించిన విషయం తెలిసిందే.బండ్ల గణేష్ నిర్మాత గా ఎన్నో సినిమాలు వచ్చాయి.

 Bandla Ganesh Sensatinal Comments On Raviteja  Tweets Viral,bandla Ganesh, Bandl-TeluguStop.com

అందులో కొన్ని కమర్షియల్ గా ప్లాప్ అవడం తో ఆర్థికంగా భారీగా నష్టపోయిన బండ్ల గణేష్ నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు.మళ్లీ నిర్మాణం లో అడుగు పెట్టేందుకు గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చేశాడు, సినిమా మొదలు పెడతాను అంటూ కొన్నాళ్ల క్రితం బండ్ల గణేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుండి బండ్ల గణేష్ గెంటి వేయబడ్డాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని కూడా ప్రచారం జరుగుతోంది.అందుకే ఒకానొక సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేశాడు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Dhamaka, Dhamaka Meet, Pawan Kalyan, Ravitej

పవన్ కళ్యాణ్ పై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటున్న కూడా మళ్లీ ఆయన్ని కలిసే అవకాశం రావడం లేదు.దాంతో పవన్ కళ్యాణ్ పై ఆశలు వదులుకొని రవితేజ తో సినిమా కు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఆ మధ్య ధమాకా సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.


Telugu Bandla Ganesh, Bandlaganesh, Dhamaka, Dhamaka Meet, Pawan Kalyan, Ravitej

ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మాస్ రాజా రవితేజ ని బండ్ల గణేష్ ఆకాశానికి ఎత్తుతూ వ్యాఖ్యలు చేశాడు.తాజాగా మరో సారి ఒక చిరుత వీడియో ని షేర్ చేశాడు.రవితేజ అన్న ఉదయాన్నే ఇలా షూటింగ్ కి వెళ్తాడు అంటూ వేటకు వెళ్తున్న చిరుత వీడియో తో ఆకాశానికి ఎత్తేలా కామెంట్ చేశాడు.

మొత్తానికి రవితేజ డేట్స్ కోసం బండ్ల గణేష్ తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థమవుతుంది.మరి మాస్ రాజా ఈ బండ్లన్న యొక్క పొగడ్తలకు పడి పోయి డేట్లు ఇస్తాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube