టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ పోతినేని తెలుగులో దేవదాసు, రెడీ, మస్కా, పండగ చేస్కో, ఎందుకంటే ప్రేమంట, ఉన్నది ఒకటే జిందగీ,హలో గురు ప్రేమకోసమే,రొమాంటిక్, రెడ్,నేను శైలజ, శివం, ది వారియర్ ఇలా తెలుగులో ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని.
కాగా రామ్ పోతినేని ఇటీవలె ది వారియర్ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.రాం పోతినేని స్టైల్ గురించి మనందరికీ తెలిసిందే.
ఎప్పటికప్పుడు సరికొత్త లుక్ లో కనిపిస్తూ అభిమానులను అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉంటాడు ఈ యంగ్ హీరో.
ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని ఒక క్లాత్ షోరూం ఓపెన్ చేయడానికి హోమ్ టౌన్ విజయవాడకి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే రామ్ ఒక కిరాక్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాడు.రామ్ క్లాత్ షోరూం ఓపెన్ చేయడానికి రావడంతో అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు.
అయితే సరికొత్త లుక్ లో షేర్ చేసిన నాలుగు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలపై రామ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక అమ్మాయిలు అయితే ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రామ్ పోతినేని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లో వీటిలో ఏది మీ ఫేవరెట్ అని అభిమానులను ప్రశ్నించగా అభిమానులు అన్ని పిక్స్ బాగున్నాయి అని రిప్లై ఇచ్చారు.కాగా ఈ ఫోటోలపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించారు.హాలీవుడ్ హీరోలా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.
రామ్ పోతినేని కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం రాం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కోసం రాకపోతేనే ఒక స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు.
అయితే ఆ లుక్ ని బట్టి చూస్తే రామ్ పోతినేని తదుపరి సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోంది అని అర్థమవుతుంది.