మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.రవితేజ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఆంజనేయులు సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు మరీ అద్భుతమైన టాక్ రాకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అయితే తాజాగా బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాను రవితేజను మోసం చేశానని ఆయన తెలిపారు.ఒక ల్యాండ్ విషయంలో నేను రవితేజను మోసం చేయడం జరిగిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.రవితేజకు నేను ఒక పొలం అమ్మగా రవితేజ ఎంతో ఇష్టపడి ఆ పొలం కొనుక్కున్నాడని ఆయన తెలిపారు.

ఆ పొలం కింద నాకు 30 ఎకరాల పొలం ఉందని ఆయన తెలిపారు.ఒక వ్యక్తి నా 30 ఎకరాల పొలం కొంటానని చెపాడని అయితే రవితేజ పొలంతో పాటు ఆ పొలం కావాలని చెప్పడంతో రవితేజకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూ సేకరణ చేస్తుందని ఇప్పుడే పొలం అమ్మితే బెటర్ అని చెప్పి పొలం అమ్మించానని బండ్ల గణేష్ పేర్కొన్నారు.రవితేజకు అబద్ధం చెప్పి మోసం చేశానని బాధ పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.

ఆ తర్వాత నేను మోసం చేశానని రవితేజకు చెప్పగా నాకు తెలుసని రవితేజ అన్నారని నన్ను ఏమీ చేయకుండా వదిలేశారని ఆయన చెప్పుకొచ్చారు.బండ్ల గణేష్ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.బండ్ల గణేష్ నిర్మాతగా త్వరలో బిజీ కానున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







