బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే అరవింద్ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
బండి సంజయ్ ను ఉద్దేశించిన చేసిన కామెంట్లను ఎంపీ అరవింద్ వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ తెలిపారు.సంజయ్ మాటలు వ్యక్తిగతం కాదని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే మాట్లాడారని పేర్కొన్నారని తెలుస్తోంది.
అరవింద్ కు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా బండి సంజయ్ తో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం.అయితే ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.