తాంత్రిక అవసరాల కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.అందుకే పార్టీ జెండా, ఎజెండా ఏది లేకుండా కేవలం పార్టీ పేరును మారుస్తున్నట్లు ప్రకటించారని ఎద్దేవా చేశారు.
ఒక తాంత్రికుడు చెప్పినట్లుగా నిత్యం క్షుద్ర పూజలు చేస్తున్నారని అన్నారు.ప్రతి 3 నెలలకు ఓసారి నల్లపిల్లితో సీఎం క్షుద్ర పూజలు చేస్తారన్నారు.
ఏది చేయాలన్నా తాంత్రికుడు చెబితేనే బయటకు వెళతాడని విమర్శలు గుప్పించారు.