Bandi Sanjay: సిరిసిల్లలో ‘బండి’ పోటీ.. ఆ విధంగా కలిసి రానుందా..?

కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ( BJP ) దేశవ్యాప్తంగా అధికారంలో లేని రాష్ట్రాలలో సరికొత్త స్టాటజీ ఉపయోగించి అధికారంలోకి వస్తుంది.గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా బిజెపి అనే పదం తెలుగు రాష్ట్రాల్లో ఉండేది కాదు.

కానీ 2019 నుంచి మొదలు బిజెపి తెలంగాణ ( Telangana ) లో కూడా మెరుగుపడిందని చెప్పవచ్చు.2019లో బిజెపి ఏదో కొన్ని స్థానాలలో గెలిచింది.కానీ ఈసారి బీఆర్ఎస్ కు ప్రధానమైన పోటీదారిగా ఎదిగిందని చెప్పకనే చెప్పవచ్చు.

దీనికి ప్రధాన కారణం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.ఈయన కరీంనగర్ ఎంపీ సీట్ కైవసం చేసుకున్న తర్వాత ఢిల్లీ బిజెపి అధిష్టానం ఆయనను తెలంగాణ బిజెపి రథసారథిగా నియామకం చేసింది.

దీంతో బండి సంజయ్ ( Bandi Sanjay ) రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పాదయాత్రలు చేస్తూ బిజెపి బలగాన్ని కూడగట్టారు.తెలంగాణలో సరికొత్త శక్తిగా బిజెపిని తయారు చేశారు.అంతటి ఘనత కలిగిన బండి సంజయ్ ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.

మరి సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పై ఆయన తట్టుకోగలుగుతారా.? ఒకవేళ సిరిసిల్లలో ఓడిపోయిన ఆయనకు కలిగే మేలు ఏంటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ ( KTR ) కు ప్రత్యేక బ్రాండ్ గా ఉంది.ఆ నియోజకవర్గాన్ని ఆయన ఎంతో డెవలప్ చేశారు.కేటీఆర్ అంటే ఎంతో ఇష్టపడతారు.

అలాంటి కేటీఆర్ పై, అంతటి బలమున్న నేత బండి సంజయ్ ఈసారి పోటీ చేయబోతున్నారు.ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో సిరిసిల్ల నియోజకవర్గమే కాకుండా ఆ జిల్లా పరిధిలో ఉండేటువంటి కొన్ని నియోజకవర్గాల్లో బండి సంజయ్ కి అధికంగా ఓట్లు పడ్డాయి.

అందుకే ఈసారి సిరిసిల్ల ( Siricilla ) లోనే పోటీ చేసి ఒకవేళ ఓడిపోయినా కానీ, పార్లమెంట్ ఎలక్షన్లలో ఆయనకు సానుభూతి లభిస్తుందని ఆలోచన చేసి ఆయనను అక్కడ పోటీలో దింపేందుకు బిజెపి అధిష్టానం సిద్ధమైంది.దీనికి బండి సంజయ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఒకవేళ కేటీఆర్ పై ఓడిపోయిన బండి సంజయ్ కి సానుభూతి మాత్రం ఏర్పడుతుందని, ఈ సానుభూతి తర్వాత జరుగు ఎన్నికల్లో కలిసి బండికి వస్తుందని చెప్పవచ్చు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు