తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.
వారిని కాపాడుకోవడం కోసమే కేసీఆర్( KCR ) డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంటూ బీఆర్ఎస్ నేతలను మభ్యపెడుతున్నారని తెలిపారు.

అయితే బీఆర్ఎస్( BRS ) అవినీతి కాగ్ నివేదిక ద్వారా బయటపడిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ఈ పాటికి జైల్లో ఉండేవారని చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని వెల్లడించారు.కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి వస్తే హరీశ్ రావు( Harish Rao )ను బీజేపీలో చేర్చుకుంటామని తెలిపారు.







