వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్..!!

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్( BJP MP Bandi Sanjay ) ఏపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓటరు అవగాహన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వర్చువల్ గా హాజరయ్యి మాట్లాడారు.

వచ్చే ఎన్నికలలో అడ్డదారులలో అధికారంలోకి రావడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 10 వేలకు పైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో వైసీపీ ఉందని ఆరోపించారు.

కేంద్రా ఎన్నికల సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు.దీనిలో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈఓను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు ఇంకా అవినీతిలో ప్రగతి మాత్రమే అని సెటైర్లు వేశారు.మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ( YCP ) అని అన్నారు.

Advertisement

దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు( Telugu State Governments ) అవినీతి, అప్పులు ఇంకా అరాచకాల్లో పోటీపడి దోచుకుంటున్నాయని బండి సంజయ్ విమర్శించారు.

ఆంధ్రాలో అరాచక పాలన రాజ్యమేలుతుంది.వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు