హెచ్ఎండీఏ భూముల అమ్మకంపై బండి సంజయ్ ఆగ్రహం

హెచ్ఎండీఏ భూముల అమ్మకంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కోకాపేటలో ఎకరా భూమి కోట్లలో ఉందని తెలిపారు.

ప్రభుత్వం రూ.7500కే అమ్మాలని చూస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.ప్రభుత్వ ఆదాయానికి బీఆర్ఎస్ గండి కొడుతోందని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి గుంట నక్కలన్నీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.సింహం సింగిల్ గా వస్తుందన్న ఆయన ఆ తరహాలోనే బీజేపీ సింగిల్ గా పోటీ చేసి భారీ మెజార్టీ సాధిస్తుందని పేర్కొన్నారు.

ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనేని తెలిపారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు