కామారెడ్డి జిల్లాలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో రైతు జేఏసీకి కాంగ్రెస్, బీజేపీలు మద్ధతు తెలిపాయి.బాధిత రైతుల ఆందోళనలపై కాంగ్రెస్ దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే రెండు బృందాలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డికి పంపారని సమాచారం.కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డిల నేతృత్వంలో ఒక బృందం.
మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు సీనియర్ నాయకులతో మరో బృందం కామారెడ్డికి బయలుదేరింది.
మరోవైపు రైతులకు మద్ధతుగా బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టగా… మరికాసేపట్లో బండి సంజయ్, ఈటల అక్కడకు చేరుకోనున్నారు.
కాగా నిన్నటి ఉద్రిక్తతతో అప్రమత్తమైన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇప్పటికే పలువురు రైతు జేఏసీ, బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.