సినిమా ఇండస్ట్రీ లోకి వారసులు రావడం అనేది మనం తరచూ చూస్తూ ఉంటున్నాం ఇప్పటికే చాలా మంది పెద్ద హీరోలు వాళ్ళ కొడుకులని హీరోగా అరం గెట్రం చేయించారు అందులో చాలా మంది సక్సెస్ అయ్యారనే చెప్పాలి.ఇక ఇండస్ట్రీ తో పాటు బాలయ్య అభిమానుల అందరిని ఊరిస్తున్న విషయం ఏంటంటే నందమూరి నటసింహం బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి ఎప్పుడు అడుగు పెడుతున్నాడు అని.

ఇప్పటికే బాలయ్య సమకాలీన హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున లా కొడుకులు ఇండస్ట్రీ కి వచ్చి హీరోలుగా స్టార్ స్టేటస్ ను అందుకుంటుంటే మోక్షజ్ఞ మాత్రం ఇండస్ట్రీ ఎంట్రీ గురించి సరైన అప్డేట్ లేక బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.ఇక క్రమం లో తెలుస్తున్న విషయం ఏంటంటే 2024 ఎలక్షన్స్ అయిపోయాక మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది ఎక్కువగా జాతకాలను నమ్మే బాలయ్య మోక్షజ్ఞ విషయం లోనూ అదే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.

ఆయన పేరు మీద ఇప్పుడు జాతకం అంత బాగలేకపోవడం తో ఎలక్షన్స్ తర్వాత అయితే మోక్షజ్ఞ కి జాతకం రీత్యా మంచి సక్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ మీద క్లారిటీ వచ్చింది ఇక డైరెక్టర్ విషయం లోనూ బాలయ్య ఫుల్ క్లారిటీ గా ఉన్నాడట వరుసగా మోక్షజ్ఞ పూరి జగన్నాథ్ తో ఒక సినిమాని,బోయపాటి తో ఒక సినిమాని చేస్తున్నారట… ఒకేసారి ఇద్దరు డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడట…








