ప్రస్తుత కాలంలోని హీరోయిన్స్ అందరూ కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే పలువురు హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వరుసగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య( Balayya ) హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు.నటి నటాషా దోషి( Natasha Doshi ) కూడా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది.
ఈమె పలు సినిమాలలో హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రమే అందుకోలేకపోయారు.బాలకృష్ణ హీరోగా నటించిన జై సింహా( Jai Simha ) సినిమాలో నటించి మెప్పించారు.
జై సింహా సినిమాలో హీరోయిన్లుగా నటించినటువంటి వారిలో ఒకరైనటువంటి నటాషా దోషి సినిమాలలో తక్కువగా నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె తాజాగా తన నిశ్చితార్థంకి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేశారు.దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె తన నిశ్చితార్థకు ఫోటోలను షేర్ చేస్తూ… తనకు కాబోయే భర్త పేరు మనన్ షా( Manan shaa ) అని తెలియజేశారు.అతనితో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నానని తెలియజేశారు.ఇలా నిశ్చితార్థం అయిన సంగతి తెలియజేసిన ఈమె పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.
ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుందని తెలిపారు.ఇలా ప్రేమ విజయం సాధిస్తుందని తెలియజేయడంతో ఈమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.