నేటి నుంచే బాలయ్య బస్సు యాత్ర ! 

ఏపీలో వైసీపీని( YCP ) ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వ్యవహాత్మక అడుగులు వేస్తోంది.బిజెపి, జనసేన( BJP, Jana Sena ) పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలకు పొత్తుల భాగంగా కొన్ని సీట్లను కేటాయించింది.

 Balayya Bus Trip From Today, Swarnandra Sadikara Yathra, Nandamuri Balakrishna,-TeluguStop.com

ఇక నిరంతరం చంద్రబాబు ప్రజల్లోనే ఉంటూ,  పర్యటనలు చేస్తూ టిడిపి అధికారంలోకి వస్తే ఏ స్థాయిలో ప్రజలకు మేలు చేస్తామో చెబుతూ అనేక ఎన్నికల హామీలు ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ ఉమ్మడిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు పెంచుతున్నారు .ఒకవైపు చంద్రబాబు( Chandrababu ) పర్యటన కొనసాగుతూ ఉండగానే, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే , చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) సైతం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు నేటి నుంచే సిద్ధం అవుతున్నారు .

Telugu Janasena, Telugudesam, Ysrcp-Politics

మేరకు బస్సు యాత్ర ( bus trip )చేపట్టేందుకు బాలకృష్ణ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.నేటి నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరుతో ఆయన రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి పర్యటించనున్నారు.

ఉమ్మడి అనంతపురం, కర్నూలు( Combined Anantapur, Kurnool ) జిల్లాల్లో బాలకృష్ణ పర్యటనలు ఉంటాయని టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.ఈరోజు ఉదయం 9 గంటలకు కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,  ఆ తరువాత బస్సు యాత్రను బాలకృష్ణ మొదలుపెడతారు.

వివిధ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులకు మద్దతుగా బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు .

Telugu Janasena, Telugudesam, Ysrcp-Politics

రాయలసీమలో బాలయ్య అభిమానులు ఎక్కువగా ఉండడంతో, ఈ జిల్లాల నుంచే ప్రారంభించి రాష్ట్రమంతటా పర్యటించేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు.ముఖ్యంగా వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో బాలయ్య పర్యటించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.రాయలసీమ జిల్లాల్లో వైసిపి ప్రభావం ఎక్కువగా ఉండడంతో , తనకు ఇక్కడ అభిమానులు ఎక్కువగా ఉండడంతో ,ఈ బస్సు యాత్ర టిడిపికి మైలేజ్ తీసుకొస్తుందని అంచనాలో బాలకృష్ణ ఉన్నారు .రాయలసీమ జిల్లాల్లో ఈ యాత్ర సక్సెస్ అయితే ఉత్తరాంధ్ర , కోస్తా జిల్లాల్లోనూ బాలకృష్ణ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube