నేటి నుంచే బాలయ్య బస్సు యాత్ర ! 

ఏపీలో వైసీపీని( YCP ) ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వ్యవహాత్మక అడుగులు వేస్తోంది.

బిజెపి, జనసేన( BJP, Jana Sena ) పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలకు పొత్తుల భాగంగా కొన్ని సీట్లను కేటాయించింది.

ఇక నిరంతరం చంద్రబాబు ప్రజల్లోనే ఉంటూ,  పర్యటనలు చేస్తూ టిడిపి అధికారంలోకి వస్తే ఏ స్థాయిలో ప్రజలకు మేలు చేస్తామో చెబుతూ అనేక ఎన్నికల హామీలు ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ ఉమ్మడిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు పెంచుతున్నారు .

ఒకవైపు చంద్రబాబు( Chandrababu ) పర్యటన కొనసాగుతూ ఉండగానే, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే , చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) సైతం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు నేటి నుంచే సిద్ధం అవుతున్నారు .

"""/" / మేరకు బస్సు యాత్ర ( Bus Trip )చేపట్టేందుకు బాలకృష్ణ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

నేటి నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరుతో ఆయన రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి పర్యటించనున్నారు.

ఉమ్మడి అనంతపురం, కర్నూలు( Combined Anantapur, Kurnool ) జిల్లాల్లో బాలకృష్ణ పర్యటనలు ఉంటాయని టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.

ఈరోజు ఉదయం 9 గంటలకు కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,  ఆ తరువాత బస్సు యాత్రను బాలకృష్ణ మొదలుపెడతారు.

వివిధ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులకు మద్దతుగా బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు .

"""/" / రాయలసీమలో బాలయ్య అభిమానులు ఎక్కువగా ఉండడంతో, ఈ జిల్లాల నుంచే ప్రారంభించి రాష్ట్రమంతటా పర్యటించేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు.

ముఖ్యంగా వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో బాలయ్య పర్యటించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రాయలసీమ జిల్లాల్లో వైసిపి ప్రభావం ఎక్కువగా ఉండడంతో , తనకు ఇక్కడ అభిమానులు ఎక్కువగా ఉండడంతో ,ఈ బస్సు యాత్ర టిడిపికి మైలేజ్ తీసుకొస్తుందని అంచనాలో బాలకృష్ణ ఉన్నారు .

రాయలసీమ జిల్లాల్లో ఈ యాత్ర సక్సెస్ అయితే ఉత్తరాంధ్ర , కోస్తా జిల్లాల్లోనూ బాలకృష్ణ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చిన మహేష్ కొడుకు గౌతమ్.. ఎమోషనల్ అయిన నమ్రత!