అఫిషియల్ : దసరాకు రాబోతున్న ”NBK108”.. బాలయ్య మాస్ పోస్టర్ వైరల్!

నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”NBK108”.ఈ మధ్యనే బాలయ్య ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

 అఫిషియల్ : దసరాకు రాబోతున్న ”-TeluguStop.com

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ సినిమాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా NBK108 కావడంతో హ్యాట్రిక్ హిట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ప్రజెంట్ బాలయ్య తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం పూర్తి కాగా మిగతా సగభాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇటీవలే ఉగాది కానుకగా ఈ సినిమా నుండి అదిరిపోయే మాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసి నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు.

ఇక ఈ రోజు ఈ సినిమా నుండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా రిలీజ్ డేట్ ప్రకటించి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు.మరి ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నాం అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు మళ్ళీ మరో పండుగకు రాబోతున్నాడు.

దసరా కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగా జరుపు కుంటారు.కాబట్టి ఈ పండుగను కూడా బాలయ్య ( Balakrishna ) ముందుగానే కబ్జా చేసేసాడు.ఈ సినిమాను దసరాకు (Dussehra) విడుదల చేస్తామని ప్రకటిస్తూ.పోస్టర్ మీద ”విజయదశమికి ఆయుధ పూజ” అని ప్రకటిస్తూ బాలయ్య మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.

ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube