నందమూరి నటవారసుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో బాలకృష్ణ…( Balakrishna ) ఈయన కెరియర్ స్టార్టింగ్ లో మంచి విజయాలను అందుకొని తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక అదే రీతిలో ముందుకు కదులుతూ మంచి విజయాలను అందుకున్నాడు.
ఇక మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తూ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా తను ఎదగడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే ఆయన వడ్డే నవీన్ తో( Vadde Naveen ) కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నాడు.దీనికి బి.గోపాల్( B Gopal ) దర్శకత్వం వహిస్తాడనే విషయాలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి.
కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.నిజానికి వడ్డే నవీన్ బాలకృష్ణ వాళ్ళ అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు.
దాంతో కొద్దిరోజుల పాటు వాళ్ల దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పటికీ, మధ్యలో కొన్ని వివాదాలు రావడం వల్ల నవీన్ కి ఆమెకు మధ్య బ్రేకప్ అయిపోయింది.ఇక ఇద్దరు విడాకులు కూడా తీసుకున్నారు.దానివల్ల ఈ సినిమాని ఆపేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
ఇక ఒక రకంగా అప్పట్లో నవీన్ సూపర్ డూపర్ సక్సెస్ లని అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) అమ్మాయితో బ్రేకప్ చేసుకోవడం అనేది ఆయన కెరియర్ కి చాలా మైనస్ అయిందనే చెప్పాలి.ఇక ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.దాని కారణంగా ఆయన నిదానంగా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోవాల్సి వచ్చింది…ఇక ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ దొరికితే మళ్లీ కంబ్యాక్ ఇవ్వడానికి ఆయన రెడీ గా ఉన్నాడు…
.