బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఆగస్టులో అన్నారు కదా...!

నందమూరి బాలకృష్ణ హీరో గానే కాకుండా ఒక కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడు అంటూ ఆహా లో స్ట్రీమింగ్ అయినా అన్ స్టాపబుల్‌ కార్యక్రమం నిరూపించింది.నందమూరి హీరో బాలకృష్ణ ను మరో స్థాయికి తీసుకు వెళ్ళిన ఆ షో యొక్క రెండవ సీజన్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఇటీవలే సదరు ఓ టీ టీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 Balakrishna Unstoppable Talk Show Season 2 Update , Aha Ott, Aha Unstoppable,b-TeluguStop.com

నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ టాక్ షో ఆగస్టులో ప్రారంభం అవుతుందని భావించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ కార్యక్రమం ఆగస్టు లో ప్రారంభం కానుందని.

దసరా కు కానీ ప్రారంభమయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్నాడు.

ఆ సినిమా ఆగస్టు చివరి వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఆ తర్వాత అంటే సెప్టెంబర్లో అన్‌ స్టాపబుల్ కార్యక్రమం యొక్క షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కనుక అక్టోబర్ లో స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.నందమూరి ప్రేక్షకులతో పాటు అభిమానులు ఇంకా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ షో కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.

సీజన్ 1 ను మించిన సర్‌ ప్రైజ్‌ లు సీజన్ 2 లో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.తెలుగు ప్రేక్షకులను విభిన్న సినిమాలతో ఆకట్టుకుంటున్న నందమూరి బాలకృష్ణ మరోసారి టాక్ షో తో కూడా మెప్పిస్తే ఆయన స్థాయి మరింతగా పెరగడం ఖాయం.

ఈ షో సీజన్ 2 జరుగుతున్న సమయంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా ను మొదలు పెట్టేలా బాలయ్య ప్లాన్‌ చేశాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube