బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్( Unstoppable ) అంటూ ఒక క్రేజీ టాక్ షో వచ్చింది.అసలు బాలకృష్ణ హోస్ట్ గా చేస్తాడని ఎవరు అనుకోలేదు కానీ అన్ స్టాపబుల్ గా బాలయ్య అదరగొట్టేశారు.
అన్ స్టాపబుల్ సీజన్ 1, 2 రెండు సూపర్ సక్సెస్ అయ్యాయి.అయితే సీజన్ 1, 2 రెండు కొద్ది పాటి గ్యాప్ తోనే చేసిన ఆహా టీం సీజన్ 3కి మాత్రం చాలా గ్యాప్ ఇచ్చారు.
అసలు అన్ స్టాపబుల్ సీజన్ 3 ఉంటుందా లేదా అంటూ కొందరు డౌట్ పడుతున్నారు.కానీ ఆహా టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 3 ఉంటుంది కానీ ఇప్పుడప్పుడే కాదని టాక్.బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి( Bhagavanth Kesari movie ) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి చేశాక బాబీ( Bhabi movie ) సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.అయితే అన్ స్టాపబుల్ సీజన్ 3 నవంబర్ లేదా డిసెంబర్ లో ఉంటుందని అంటున్నారు.
ఆహా టీం ఈసారి సీజన్ ని మరిత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు.ఈ సీజన్ లో వెంకటేష్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్స్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది.







