స్టార్ హీరో బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాల ఘన విజయాలతో పెరిగిన క్రేజ్ కు అనుగుణంగా ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే తారకరత్న విషయంలో బాలయ్య తీసుకుంటున్న కేర్ కు ఆయన అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతుండటం గమనార్హం.
పొలిటికల్, సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు బాలయ్య తాత్కాలికంగా దూరమయ్యారని సమాచారం అందుతోంది.నిద్రాహారాలు మాని తారకరత్న త్వరగా కోలుకోవడానికి బాలయ్య తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని సమాచారం.
బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచే తారకరత్న చలనం లేకుండా ఆస్పత్రిలో ఉండటం బాలయ్యను ఎంతగానో కదిలించిందని తెలుస్తోంది.

బాలయ్య మనస్సు మంచి మనస్సు అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.తారకరత్నకు ఇచ్చే మందుల విషయంలో కూడా బాలకృష్ణ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య కోసమైనా తారకరత్న త్వరగా కోలుకుని మామూలు మనిషి కావాలని అభిమానులు భావిస్తున్నారు.
ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతుండటం గమనార్హం.

బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ ల షూటింగ్ మొదలుకావడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ బాలయ్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు.మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బాలయ్యతో పని చేయడానికి ఇతర భాషల దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.బాలయ్య సినిమాల బడ్జెట్లు కూడా అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు 20 కోట్ల రూపాయలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని తెలుస్తోంది.
బాలయ్య ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
