బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు సంబంధించి న షాకింగ్ విషయాలు రివీల్ అవుతున్నాయి.ఈ సినిమాలో ఇప్పటివరకు బాలయ్య రెండు పాత్రల్లోనే కనిపిస్తారని ప్రచారం జరిగింది.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో మూడు రోల్స్ లో కనిపించనున్నారట.ఈ మూడు పాత్రలలో ఒక పాత్ర ఎక్కువ సమయం ఉండదని తెలుస్తోంది.
బాలయ్య ట్రిపుల్ రోల్స్ లో నటించడం కొత్త కాదు.గతంలో కొన్ని సినిమాలలో బాలయ్య మూడు పాత్రలలో అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమాలో కూడా బాలయ్య మూడు పాత్రల్లో నటిస్తే ఆ పాత్రలు సినిమాకు ప్లస్ అవుతాయి.ఈ సినిమాలో బాలయ్య ఒక పాత్రలో క్లాస్ గా మరో పాత్రలో ఊరమాస్ గా కనిపించనున్నారు.
సంక్రాంతికి బాలయ్య హవా మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది.
అఖండ సినిమా కలెక్షన్ల స్థాయిలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.అఖండ సినిమా రిలీజ్ సమయంలో ఏపీలో టికెట్ రేట్లు సైతం తక్కువగానే ఉన్నాయి.
వీరసింహారెడ్డి సినిమాకు మాత్రం అలాంటి ఇబ్బందులు లేవు.వీరసింహారెడ్డి మూవీ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించే సత్తా ఉన్న సినిమాలలో ఒకటి కావడం గమనార్హం.

అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.బాలయ్య సైతం రొటీన్ రోల్స్ కు దూరంగా ఉంటూ ఇమేజ్ కు అనుగుణంగా కథలను ఎంచుకుంటున్నారు.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.







