నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరమే లేదన్నట్టుగా శ్రీ భరత్ వ్యాఖ్యానించడం ఎన్టీఆర్ అభిమానులతో పాటు టీడీపీ లో మెజార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
అయితే భరత్ అకస్మాత్తుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక బాలయ్య ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో విశాఖ ఎంపీ గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందాడు.
ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు.అయితే ప్రస్తుతం టీడీపీలో యువ నాయకత్వం లోటు బాగా కనిపిస్తుండడంతో భరత్ ను టీడీపీలో యాక్టివ్ చేసేందుకు బాలయ్య తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీనిలో భాగాంగానే జూనియర్ ఎన్టీఆర్ మీద భరత్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ హవా నడుస్తోంది.అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ ఓటమి చెందడం, ఆయన సామర్ధ్యం మీద తెలుగుదేశం పార్టీలో మెజార్టీ నాయకులకు నమ్మకం లేకపోవడంతో బాలయ్య తన రాజకీయ వారసుడిగా భరత్ ను దింపి టీడీపీలో కీలక బాధ్యతలు దక్కేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.ఓ విధంగా లోకేష్ ఫెయిల్ కావడం కూడా శ్రీ భరత్ ఆశలను పెంచుతోంది.
టీడీపీలో ప్రస్తుతం చెప్పుకోదగిన ప్రజాదరణ కలిగిన నాయకులు లేరు.యంగ్ ప్రతినిధులు కూడా లేరు.
ఇటువంటి సమయంలో శ్రీ భరత్ అనూహ్యంగా తెర మీదకు వచ్చారు.తాజాగా ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో టీడీపీలో యంగ్ టాలెంట్ పుష్కలంగా ఉందంటూ చెప్పడం కూడా దీనిలో భాగమేనని తెలుస్తోంది.
లోకేష్ సామర్థ్యంపై తీవ్రంగానే చర్చ జరుగుతున్న సమయంలోనే శ్రీ భరత్ పార్టీలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగుదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పి శ్రీ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టు అనుమానాలు మొదలయ్యాయి.టీడీపీ నాయకత్వం ఎపుడూ నారా నందమూరి కుటుంబాల చుట్టూనే తిరుగుతోంది.నారా వారసుడు లోకేష్ కి పార్టీలోనే అంత ఆదరణ లేదని, ఇక ముందు ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ తనకు పోటీ కాకుండా ఉండేందుకు బాలయ్య సూచనల మేరకు భరత్ ఈ విధంగా వ్యాఖ్యానించాడట.
టీడీపీకి ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పడం ద్వారా తానున్నాను అన్న సంకేతాలను ఇటు హై కమాండ్ కి అటు పార్టీ నాయకులకు కూడా భరత్ పంపుతున్నారు.బాలయ్య అల్లుడి హోదాలో పార్టీలో తనకు పెద్ద పీటే దక్కుతుందనే ఆలోచనలో ఆయన ఉన్నాడు.
బాలయ్య అండ ఉంటే నందమూరి ఫ్యామిలీల మద్దతు కూడా తనకే దక్కుతుందని భవిష్యత్తులో పార్టీలో కీలక పదవులు పొందవచ్చనే ఆలోచనలో భరత్ ఉన్నట్టు తెలుస్తోంది.