Balakrishna Priyanka Jawalkar: బాలయ్య హీరోయిన్‌ విషయంలో మళ్లీ విమర్శలు.. ఇదెక్కడి ఎంపిక?

నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఆ సినిమా లో హీరోయిన్స్ ఎంపిక నుండి నటించిన తర్వాత వరకు అనేక సమస్యలు వస్తున్నాయి.

బాలకృష్ణ వయసు కు మరియు ఆయన స్టార్ డం కి తగ్గట్టుగా హీరోయిన్స్ సెట్ అవ్వడం లేదు.

సీనియర్ హీరో లు అంతా కూడా హీరోయిన్స్ సెట్ అవ్వక పోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ ఏ సినిమా మొదలు పెట్టాలనుకున్న మొదట హీరోయిన్ సమస్య తలెత్తుతుంది.

నయన తార కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెనే వరుసగా కంటిన్యూ చేయలేక పోతున్నారు.ఇక కొత్త హీరోయిన్స్ ని తీసుకు రావాలంటే మరీ చిన్న వయసు వారు ఉంటున్నారు.

ఉన్నవారు ఆయన కు జోడి గా నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు అనే ప్రచారం జరుగుతుంది.తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ ఒక సినిమా ను చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈ నెల నుండి ప్రారంభం కాబోతున్నాయి.ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై మళ్ళీ చర్చ మొదలైంది.

టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేశారు అనే ప్రచారం జరుగుతుంది.

అదే నిజమైతే మరీ అంత చిన్న అమ్మాయితో బాలకృష్ణ సినిమా ఏంటి అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.బాలకృష్ణ కు ఆమె తప్ప మరెవ్వరు దొరకలేదా.కనిపించలేదా అంటూ కామెంట్స్ చేసే వారు చాలా మంది ఉన్నారు.

సోషల్ మీడియా తో పాటు అన్ని మీడియా లో కూడా బాలకృష్ణ మరియు ప్రియాంక జవాల్కర్ యొక్క జోడి ఏ మాత్రం బాగుండదు అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి అనిల్ రావిపూడి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా లేదంటే కంటిన్యూ చేస్తాడానే చూడాలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

బాలకృష్ణ సినిమా అంటే ఇలాంటి సమస్యలు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి.ముందు ముందు సినిమాలకైనా ఈ సమస్య ఉండకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు